బీఆర్ఎస్‌కు మరో కీలక నేత గుడ్‌బై
బీఆర్ఎస్ కు ఎన్నికల వేళ మరో షాక్ తగలనుంది. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు
బీఆర్ఎస్ కు ఎన్నికల వేళ మరో షాక్ తగలనుంది. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీటు దక్కదని తేలడంతో పార్టీ మారైనా ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయాలని అనేక మంది భావిస్తున్నారు. కేసీఆర్ ఇప్పటికే 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. పెద్దగా మార్పులు లేకుండానే సిట్టింగ్‌లందరికీ దాదాపుగా సీట్లు ఖరారు చేశారు. దీంతో అసంతృప్త నేతలు ఒక్కొక్కరు తమ దారి తాము చూసుకుంటున్నారు.
టిక్కెట్ రాలేదని..
మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి నియోజకవర్గం టిక్కెట్ ను ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఆశించారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టిక్కెట్ ను ఖరారు చేశారు. దీంతో టిక్కెట్ పై ఆశలు పెట్టుకున్న కసిరెడ్డి నారాయణరెడ్డి తన దారి తాను చూసుకునే ప్రయత్నంలో పడ్డారు. ఆయన కాంగ్రెస్ లో చేరనున్నారు. ఈ మేరకు పార్టీ అగ్రనేతలతో చర్చించారని తెలిసింది. రెండు మూడు రోజుల్లో కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారు.