KTR : కేటీఆర్ కు హైకోర్టులో కొంత ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హైకోర్టులో కొంత ఊరట లభించింది.;

Update: 2025-01-08 12:04 GMT

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు హైకోర్టులో కొంత ఊరట లభించింది. ఏసీబీ విచారణకు తన వెంట న్యాయవాదిని తీసుకెళ్లేందుకు హైకోర్టు అనుమతించింది. అదే సమయంలో విచారణ సమయంలో ఆడియో, వీడియో రికార్డులను మాత్రం అనుమతించేది లేదని తెలిపింది. ఆడియో, వీడియో రికార్డు చేసేందుకు అవకాశం లేదని తెలిపారు.

న్యాయవాదిని అనుమతించాలని...
విచారణ సమయంలో తనతో పాటు న్యాయవాదిని అనుమతించడంతో పాటు ఆడియో, వీడియో రికార్డులను అనుమతించాలని కేటీఆర్ వేసిన పిటీషన్ పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసిన నేపథ్యంలో హైకోర్టు విచారించింది. కేటీఆర్ వెంట న్యాయవాది రామచంద్రారావు ను తీసుకెళ్లేందుకు అనుమతించాలని కోరగా అందుకు హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. అయితే విచారణ సందర్భంగా ఏదైనా అనుమానాలు ఉంటే తిరిగి న్యాయస్థానాన్ని సంప్రదించవచ్చని న్యాయమూర్తి తెలిపారు.


Tags:    

Similar News