ఈడీ ఎదుటకు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్
ఫార్ములా ఈ రేసు కేసులో నేడు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు;
ఫార్ములా ఈ రేసు కేసులో నేడు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. హెచ్ఎండీఏ నిధులను విదేశీ సంస్థలకు దారి మళ్లించడంపై అరవింద్ కుమార్ ను ప్రశ్నిస్తున్నారు. నిన్న ఈడీ అధికారులు హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి నివిచారించారు. తొమ్మిది గంటల పాటు విచారించిన ఈడీ అధికారులు పలు ప్రశ్నలకు సమాధానం రాబట్టే ప్రయత్నం చేశారు.
ఫెమా నిబంధనలను...
ఈరోజు ఇదే కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను విచారించనున్నారు. ఈడీ అధికారుల ఎదుటకు అరవింద్ కుమార్ హాజరయ్యారు. ఫెమా నిబంధనల ఉల్లంఘనపై ప్రధానంగా ఈ విచారణలో అరవింద్ కుమార్ ను ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎవరి అనుమతితో ఈ నిధులను విడుదల చేశారన్న దానిపై కూడా ఆరా తీసే అవకాశం ఉంది.