KTR : నేడు ఏసీబీ ఎదుట విచారణకు కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు అవినీతి నిరోధక శాఖ అధికారుల ఎదుట హాజరు కానున్నారు;
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు అవినీతి నిరోధక శాఖ అధికారుల ఎదుట హాజరు కానున్నారు. ఫార్ములా ఈ రేసు కేసులో నేడు కేటీఆర్ ను విచారించేందుకు ఏసీబీ సిద్ధమయింది. ఉదయం 9.30 గంటలకు ఆయన నందినగర్ నివాసం నుంచి బయలుదరి పది గంటలకు ఏసీబీ కార్యాలయానికి చేరుకుంటారు. ఫార్ములా ఈ రేస్ కు సంబంధించిన అవినీతి ఆరోపణలపై కేటీఆర్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్నారు.
న్యాయవాదిని అనుమతించాలని...
అయితే న్యాయవాదిని తనతో అనుమతించాలని నిన్న కోర్టులో కేటీఆర్ పిటీషన్ వేసినప్పటికీ అందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. వేరే రూములో ఉండి విచారణను పరిశీలించవచ్చని పేర్కొంది. అదే సమయంలో ఆడియో, వీడియో రికార్డింగ్ కు కూడా న్యాయస్థానం అనుమతించలేదు. దీంతో న్యాయవాది రామచంద్రరావుతో కలసి కేటీఆర్ నేడు ఏసీబీ విచారణకు హాజరు కానుండటంతో బీఆర్ఎస్ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఉదయం నుంచి బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ నివాసానికి చేరుకుంటున్నారు.