Telangana : రేవంతూ.. ముందు హడావిడి ఎందుకు? తర్వాత ఇలా తగ్గటమేమిటయ్యా?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు వినిపిస్తున్నాయి. సినిమా టిక్కెట్ ధరల పెంపుపై నెట్టింట సెటైర్లు వినిపస్తున్నాయి;
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు వినిపిస్తున్నాయి. పుష్ప 2 సినిమా సందర్భంగా సంథ్య థియేటర్ లో తొక్కిసలాట జరిగి మహిళ మృతి చెందిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన ప్రకటనలు తర్వాత ఆచరణలో అది అమలు చేస్తున్న తీరుపై నెట్టింట సెటైర్లు వినిపిస్తున్నాయి. పుష్ప సినిమా సందర్భంగా తొక్కిసలాట జరగడం దురదృష్టకరమని అందరికీ తెలుసు. అయితే దీనిపై బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన రేవంత్ సర్కార్ హీరో అక్కడకు రావడంపై విమర్శలు చేసింది. అంతవరకూ ఓకే. అల్లు అర్జున్ థియేటర్ కు వచ్చిన సందర్భంగా రోడ్ షోను నిర్వహించడం కూడా ఎవరూ హర్షించరు. కానీ అదే సమయంలో ప్రభుత్వం చేసిన ప్రకటన కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హోరెత్తిపోతుంది.
రేట్లు పెంచబోమని...
నాడు ప్రీమియర్ షోలకు అనుమతించబోమని, టిక్కెట్లు ధరలు ఇక పెంచబోమని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెగేసి చెప్పింది. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకూ పదే పదే ఇదే విషయాన్ని చెబుతూ దాన్ని సాగదీస్తూ వచ్చారు. జనం కూడా నిజమేనేమోనని భావించారు. ఇక తెలంగాణలో సినిమా టిక్కెట్ ధరలు పెంచరేమోనని అందరూ ఆనంద పడ్డారు. టాలీవుడ్ పెద్దలతో జరిగిన సమావేశంలోనూ రేవంత్ రెడ్డి ఇకపై సినిమా టిక్కెట్ ధరలు పెంచబోమని, ప్రీమియర్ షోలకు అనుమతించబోమని చెప్పినట్లు వార్తలు రావడంతో అందరూ ఖుషీ అయ్యారు. కానీ ఆనంద పడినంత సేపు లేదు. టిక్కెట్ ధరలు పెంచడానికి. ఏమయిందో తెలియదు కానీ తెలంగాణలో సంక్రాంతి సినిమాలకు టిక్కెట్ ధరలను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విమర్శలకు తావిస్తుంది.
ధరల పుంపుదలకు...
గేమ్ ఛేంజర్ టికెట్ రేట్లను పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీచేసింది. జనవరి 10 తేదీ ఒకరోజు ఉదయం 4 గంటల షో నుంచి 6 షోస్ కు కు అనుమతి కూడా ఇచ్చింది. మల్టీప్లెక్స్ టికెట్ కు అదనంగా 150 రూపాయలు పెంచుకునేందుకు సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ కు అదనంగా వంద రూపాయలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. జనవరి 11వ తేదీ నుంచి నుంచి 5 షోలకు కు అనుమతి ఇచ్చింది. జనవరి 11వ తేదీ నుంచి మల్టీ ప్లెక్స్ ధర 100 రూపాయలు పెంపునకు అనుమతిని తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో విమర్శలకు తావిస్తుంది. సింగిల్ స్క్రీన్ ధర్ 50 రూపాయలు పెంపునకు అనుమతి ఇచ్చింది. బెనిఫిట్ షోస్ కు తెలంగాణా ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. అయితే మాట తప్పిన ప్రభుత్వాన్ని మాత్రం నెటిజెన్లు తప్పపడుతన్నారు. టాలీవుడ్ కు తలొగ్గటమేమిటయ్యా? అంటూ రేవంత్ సర్కార్ ను నిలదీస్తున్నారు.