హైకోర్టులో కేటీఆర్ లంచ్ మోహన్ పిటీషన్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు;

Update: 2025-01-08 06:23 GMT

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. ఏసీబీ విచారణకు సంబంధించి తనతో పాటు న్యాయవాదిని కూడా అనుమతించాలని కోరుతూ ఆయన లంచ్ మోషన్ పిటీసన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. లంచ్ తర్వాత దీనిపై విచారణ జరగనుంది.

ఫార్ములా ఈ కారు రేసు కేసులో...
ఫార్ములా ఈ కారు రేసు కేసులో రేపు అవినీతి నిరోధక శాఖ అధికారుల ఎదుట కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది. అంతకు ముందు కూడా తన న్యాయవాదిని అనుమతించకపోవడంతో వెనక్కు వెళ్లిపోయారు. దీంతో మరోసారి ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. నేడు కోర్టు తీర్పు ప్రకారం న్యాయవాదితో వెళ్లవచ్చా? లేదా? అన్నది హైకోర్టులో తేలనుంది.


Tags:    

Similar News