KTR : రేవంత్ రెడ్డి ముర్ఖపు నిర్ణయాలు.. వీటిని సమర్థించం

రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూర్ఖపు నిర్ణయాలను తీసుకుంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

Update: 2024-05-30 07:56 GMT

రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూర్ఖపు నిర్ణయాలను తీసుకుంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ చిహ్నంపై చార్మినార్ ను తొలగించడాన్ని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. చార్మినార్ తో పాటు చారిత్రాత్మకమైన కాకతీయ కళా తోరణాన్ని తొలగించడమేంటని ఆయన ప్రశ్నించారు. చార్మినార్ వద్ద జరిగిన బీఆర్ఎస్ నిరసన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు.

ఉద్యమం చేయని....
తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేయమని రేవంత్ రెడ్డికి తెలంగాణ చరిత్ర ఏం తెలుసునని ఎద్దేవా చేవారు. ఎందరి పోరాటాలు, త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ అస్థిత్వాన్ని చెరిపేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న కేటీఆర్ పదేండ్లలో సాధించిన ప్రగతిని కాదని ప్రజలను ఏమార్చడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఉద్దేశ్యపూర్వకంగానే రాజముద్రను తొలగించే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు పద్మారావు గౌడ్‌, రాజయ్య, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ తదతరులు పాల్గొన్నారు.


Tags:    

Similar News