లగచర్ల ఘటన నిందితులందరికీ బెయిల్
లగచర్ల ఘటనలో జైలు శిక్ష అనుభవిస్తున్న నిందితులకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది
లగచర్ల ఘటనలో జైలు శిక్ష అనుభవిస్తున్న నిందితులకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితేకొన్ని షరతులు విధించింది. పట్నం నరేందర్ రెడ్డితో పాటు సురేష్ తో పాటు నిందితులందరికీ బెయిల్ మంజూరు చేసింది. పట్నం నరేందర్ రెడ్డి మాత్రం రెండు ష్యూరిటీలు యాభై వేలు చొప్పున ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. మిగిలిన నిందితులు ఇరవై ఐదు వేల పూచికత్తు ఇవ్వాలని తెలిపింది.
షరతులివే....
దీంతో పాటు ప్రతి బుధవారం పోలీస్ స్టేషన్ ఎదుట హాజరై సంతకం పెట్టాలని కోరింది. రాష్ట్ర వ్యాప్తంగా లగచర్ల ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కలెక్టర్ పై దాడి కేసులో వీరందరూ గత 35 రోజుల నుంచి జైలులో ఉంటున్నారు. నాంపల్లి స్పెషల్ కోర్టు ఈ కేసులో ఉన్న నిందితులందరికీ బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now