అల్లు అర్జున్ అరెస్ట్ పై కేటీఆర్ ఏమాన్నారంటే..?

అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు

Update: 2024-12-13 08:26 GMT

KTR

అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. పాలకుల అభద్రత కారణంగానే అల్లు అర్జున్ అరెస్ట్ జరిగిందని కేటీఆర్ అన్నారు. నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం సరైన విధానం కాదని కేటీఆర్ ట్వట్ చేశారు. సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో మరణించిన కుటుంబం పట్ల సానుభూతి తనకు ఉందన్నారు.

అలాగయితే...
అయితే అల్లు అర్జున్ అరెస్ట్ ను మాత్రం తాను ఖండిస్తున్నానని తెలిపారు. తొక్కిసలాటకు కారణమంటూ అల్లు అర్జున్ పట్ల ఇలా వ్యవహరించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగయితే హైడ్రా కూల్చివేతల కారణంగా ఇద్దరు మరణించారని, ఈ కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని కేటీఆర్ ట్వీట్ చేశారు.


Tags:    

Similar News