అక్బరుద్దీన్ vs కేటీఆర్.. హాట్ హాట్ గా అసెంబ్లీ

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే అంశంపై చర్చ జరిగింది

Update: 2023-02-04 07:39 GMT

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ, మంత్రి కేటీఆర్ మధ్య వాగ్వాదం జరిగింది. అక్బరుద్దీన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను ముఖ్యమంత్రి కలవరని, మంత్రులు అపాయింట్‌మెంట్ ఇవ్వరని, సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని ఫైర్ అయ్యారు. తెలంగాణలో ఉర్దూను రెండో అధికార భాషగా గుర్తించినా ఆ భాషకు ఇప్పటికీ అన్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణ సచివాలయంలో మసీదు నిర్మాణం ఎంతవరకూ వచ్చిందని అక్బరుద్దీన్ ప్రశ్నించారు. హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రి పరిస్థిితి ఏమిటని అక్బరుద్దీన్ ప్రభుత్వాన్ని నిలదీశారు.

గొంతు చించుకున్నా...
పాతబస్తీకి ఎందుకు మెట్రో రైలును వేయడం లేదని ఆయన ప్రశ్నించారు. చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఇంకా ఎంత సమయం కావాలని అక్బరుద్దీన్ మండి పడ్డారు. దీనిపై మంత్రి కేటీఆర్ కూడా ధీటుగానే స్పందించారు. ఎంఐఎంకు ఏడుగురు సభ్యులు మాత్రమే ఉన్నారని, సభ్యుల సంఖ్య ప్రకారమే సమయం ఇస్తారని తెలిపారు. గొంతు చించుకున్నంత మాత్రాన ఉపయోగమేమీ ఉండదని కేటీఆర్ ఫైర్ అయ్యారు. అక్బరుద్దీన్ బీఏసీకి రాకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. దీంతో కాసేపు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.


Tags:    

Similar News