తెలంగాణ సర్కార్ కు వెంకయ్య వినతి.. పునరాలోచించుకోవాలంటూ?

ఇంటర్‌లో ద్వీతీయ భాషగా సంస్కృతాన్ని ఉంచాలని తెలంగాణ భావిస్తోందని విన్నానని, దీనిపై పునరాలోచించాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.;

Update: 2025-04-11 06:50 GMT
venkaiah naidu, former vice president, sanskrit, telangana
  • whatsapp icon

ఇంటర్‌లో ద్వీతీయ భాషగా సంస్కృతాన్ని ఉంచాలని తెలంగాణ భావిస్తోందని విన్నానని, దీనిపై పునరాలోచించాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. మార్కుల దృష్ట్యా ఉంచాలని చూస్తే మాత్రం పునరాలోచన చేయాలని ఆయన కోరారు. విద్యార్థులను మాతృభాషకు దూరం చేయడం మంచిది కాదని, సంస్కృతం బోధించడంలో తప్పు లేదని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు.

సంస్కృతిని అందిపుచ్చుకునే...
సంస్కృతిని అందిపుచ్చుకునే దిశగా అమ్మభాష ఆలంబనగా నిలుస్తుందన్న వెంకయ్య నాయుడు జాతీయ విద్యావిధానం-2020 మాతృభాషకు ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. పిల్లలను మాతృభాషకు చేరువ చేసేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని వెంకయ్యనాయుడు అన్నారు. తెలుగు నేర్పితేనే సంస్కృతి సంప్రదాయాలు నిలబడతాయని వెంకయ్య అన్నారు.


Tags:    

Similar News