Cables from electric poles: వాటిని తొలగించాలట.. అయ్యో ఇప్పుడెలా?

విద్యుత్ స్తంభాల నుండి అనవసరమైన కేబుల్స్, ఇతర వస్తువులను వెంటనే తొలగించాలని

Update: 2024-08-30 10:09 GMT

విద్యుత్ స్తంభాల నుండి అనవసరమైన కేబుల్స్, ఇతర వస్తువులను వెంటనే తొలగించాలని లేని పక్షంలో వారిపై చర్యలు తీసుకుంటామని సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TGSPDCL) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను హెచ్చరించారు. కేబుల్‌ల తొలగింపు గురించి కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు తెలియజేయడానికి జూలై 27, ఆగస్టు 7, ఆగస్టు 28 తేదీల్లో మూడుసార్లు సమావేశాలు నిర్వహించామన్నారు. ఆగస్టు 7న జరిగిన సమావేశంలో ప్రధాన రహదారులపై వారం రోజుల్లోగా, ఇతర ప్రధాన రహదారులపై రెండు వారాల్లోగా నిబంధనల ప్రకారం కేబుల్ ఆపరేటర్లు చర్యలు తీసుకోవాలని సూచించామన్నారు. కొంతమంది కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు సమావేశాల్లో ఒప్పందాలు చేసుకున్నప్పటికీ తొలగింపు ప్రక్రియలో సహకరించలేదన్నారు.

ఇక గ్రేటర్‌ హైదరాబాద్‌లో విద్యుత్‌ స్తంభాలకు తంతులు, కేబుల్‌ బండిల్స్‌, టెలికాం పరికరాలు వేలాడుతుండడంతో పలు ప్రమాదకర ఘటనలు చోటుచేసుకుంటున్నాయన్నారు. కేబుల్ నిర్వహణ సరిగా లేకపోవడంతో సామాన్య ప్రజలు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారని, విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌లు జరుగుతూ ఉండడంతో విద్యుత్‌ అంతరాయం ఏర్పడింది. “వినియోగదారులకు అసౌకర్యాన్ని నివారించడానికి కేబుల్ కంపెనీలు, ఇంటర్నెట్ ప్రొవైడర్లకు తగినంత సమయం ఇచ్చాం. అయితే ఇప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో కేబుల్ తొలగింపు ప్రారంభం కాలేదు.” అని ముషారఫ్ ఫరూఖీ అన్నారు.


Tags:    

Similar News