25 నుంచి రైతు ఉద్యమం... కేసీఆర్
ీఈ నెల 25వ తేదీ నుంచి తెలంగాణలో రైతు ఉద్యమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు
ీఈ నెల 25వ తేదీ నుంచి తెలంగాణలో రైతు ఉద్యమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు టీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశంలో ఆయన ప్రకటించారు. యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని, పంటలకు మద్దతు ధర కల్పించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టాలని కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంటు ఉభయసభల్లోనూ రైతు సమస్యలపై సభ్యులు ఆందోళన చేయనున్నారు. కేంద్రం ప్రతి పంటను కొనుగోలు చేసేలా వత్తిడి చేయాలని కేసీఆర్ సమావేశంలో పిలుపునిచ్చారు.
కశ్మీర్ ఫైల్స్ పై....
మూలాల్లోకి వెళ్లి రైతులను కలసి సమస్యలపై చర్చించాలని తెలిపారు. దేశంలో రైతు సమస్యలు అనేకం ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. క్షేత్రస్థాయిలో ఉద్యమం జరగాలని కేసీఆర్ చెప్పారు. కాశ్మీర్ ఫైల్స్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సమస్యను పక్కదారి పట్టించేందుకే ఈ సినిమా అని కేసీఆర్ వ్యాఖ్యానించారని తెలిసింది. ప్రతి ఒక్కరూ రైతు సమస్యలపై ఫోకస్ పెట్టి ప్రజలను ఉద్యమంలో భాగస్వామ్యులను చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. 119 నియోజకవర్గాల్లో సర్వేలు చేయిస్తున్నానని, ఈ నెలాఖరుకు నివేదికలు అందుతాయని కేసీఆర్ సమావేశంలో చెప్పారు.