Telangana : అధికారులపై హైకోర్టు ఆగ్రహం..చచ్చిపోతే తప్ప స్పందించరా?
నారాయణపేట జిల్లా మాగనూర్ ఘటనపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది;
నారాయణపేట జిల్లా మాగనూర్ ఘటనపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మాగనూర్ జడ్పీ హైస్కూల్ లో కలుషిత ఆహారం తిని అనేక మంది అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. అధికారులు నిద్రపోతున్నారా? అని ప్రశ్నించింది. పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరగడమనేది చాలా తీవ్రమైన అంశంగా పరిగణించాల్సి వస్తుందని హైకోర్టు అభిప్రాయపడింది.
చనిపోతున్నా స్పందించరా?
వారంలో మూడు సార్లు కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. పిల్లలు కలుషిత ఆహారం తిని చనిపోతే తప్ప అధికారుల్లో చలనం రాదా? అని సంచలన వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి ఘటనలను సీరియస్ గా తీసుకోవడం లేదని తెలిపింది. వారం రోజుల్లో కౌంటర్ వేస్తామన్న ప్రభుత్వ న్యాయవాదిపై ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.