ప్రభుత్వాన్ని కూల్చేందుకే ఈ కుట్ర
ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూలదేసేందుకు ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు
ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూలదేసేందుకు ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. చండూరు సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కొనాలని కొందరు చూశారని, కానీ మన ఎమ్మెల్యేలు అమ్ముడు పోలేదన్నారు. ఎమ్మెల్యేలు ఢిల్లీ బ్రోకర్లను చెప్పుతో కొట్టి పంపించారని ఆయన అనన్ారు. మోదీ రెండు సార్లు ప్రధానిగా చేశారని, ఇంకా ఇలాంటి అరాచకాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు.
గెలుపు ఖాయం...
మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ఖాయమయిందని ఆయన అన్నారు. ఫలితాలు ఎప్పుడో నిర్ణయించారన్నారు. అవసరం లేకుండా మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందన్నారు. ప్రజలు కూడా అభివృద్ధిని చూసి ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఏమాత్రం ఆదమరచినా తమ ఇంటిని కాల్చుకున్నట్లేనని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఎవరో చెప్పే మాయమాటలను నమ్మవద్దని కేసీఆర్ ప్రజలకు సూచించారు. అన్ని వర్గాలను కేంద్ర ప్రభుత్వం వంచిస్తుందన్నారు. చేేనేతలపై ఐదు శాతం జీఎస్టీ విధించి ఇబ్బందులు పెడుతుందని ఆయన అన్నారు. ప్రలోభాలకు గురయితే చివరకు మోసపోయేది మనమేనన్నది గుర్తించాలని కేసీఆర్ అన్నారు.