Revanth Reddy : నేడు వరంగల్ కు రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వరంగల్ జిల్లాలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

Update: 2024-05-07 03:17 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వరంగల్ జిల్లాలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించనున్నారు. రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ ల ద్వారా ప్రజల ముందుకు వెళ్లనున్నారు. విపక్షాల విమర్శలను తిప్పికొడుతూ తమకు ఓటు ఎందుకు వేయాల్సిన అవసరం ఉందో రేవంత్ రెడ్డి వివరిస్తున్నారు. ఈరోజు వరంగంల్ లో సాయంత్రం ఆరు గంటలకు రోడ్ షో నిర్వహిస్తారు.

రోడ్ షోలతో...
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రోడ్ షో లో పాల్గొంటారు. అనంతరం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో జరిగే ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యకు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహిస్తూ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెబుతూ వెళుతున్నారు.


Tags:    

Similar News