Revanth Reddy : ఇచ్చిన మాటకు కట్టుబడి అనుకున్నట్లుగానే ఆగస్టు 15లోపు రైతులను రుణవిముక్తులను చేస్తాం

తెలంగాణలో ఉన్న రైతులకు రెండో విడత రైతు రుణమాఫీ ప్రక్రియను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు

Update: 2024-07-30 07:47 GMT

తెలంగాణలో ఉన్న రైతులకు రెండో విడత రైతు రుణమాఫీ ప్రక్రియను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అసెంబ్లీ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఆయన రెండో విడత నిధులను విడుదల చేశారు. రెండో విడతగా 1.50 లక్షల రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 15వ తేదీ నాటికి తెలంగాణలో రైతులందరికీ రుణవిముక్తి లభిస్తుందని అన్నారు. ఏకకాలంలో రుణమాఫీని అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన తెలిపారు. లక్షల మంది రైతుల ఇళ్లల్లో ఆనందం కనిపించడంతో తమ ధన్యమయిందని రేవంత్ రెడ్డి అన్నారు.

రెండో విడతగా...
రెండో విడతగా 6.4 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరుతుందని తెలిపారు. మొత్తం ఏడు వేల కోట్ల రూపాయలు జమ కానున్నాయని తెలిపారు. మొదటి, రెండో విడత రుణమాఫీ కి ప్రభుత్వం 12,289 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీని చేస్తామని ప్రకటించి నిధులున్నా న్యాయం చేయలేదన్నారు. లక్ష మాఫీ వడ్డీకి కూడా సరిపోలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు తీరని అన్యాయం జరిగిందన్న ఆయన రాహుల్ గాంధీ, సోనియా ఇచ్చిన మాట మేరకు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. తమ ప్రభుత్వం చేతల ప్రభుత్వమన్న ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందని తెలిపారు.


Tags:    

Similar News