Revanth Reddy : మూసీ నది ప్రక్షాళన ఖాయం. స్పష్టం చేసిన సీఎం

హైడ్రా పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.

Update: 2024-10-17 11:49 GMT

హైడ్రా పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. మూసీ నది ప్రక్షాళనను కొందరు దుర్మార్గులు అడ్డుకుంటున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ నియోజకవర్గంలో రచ్చబండ నిర్వహిస్తానని, అక్కడ ప్రజల అభిప్రాయాలను తెలుసుకుందామని తెలిపారు. నదీగర్భంలో నివసిస్తున్న వారిని బయకు పంపడం తప్పా? అని ఆయన ప్రశ్నించారు. హైడ్రా ఏమైనా భూతమా? అని ప్రశ్నించారు. బఫర్ జోన్‌లో పది వేల ఇళ్లున్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నగరాన్ని ఏం చేయాలని అనుకుంటున్నారని విపక్షాలకు సూటి ప్రశ్న వేశారు. మూసీ నది సుందరీకరణ వల్ల తమ ఆర్థిక ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

మూసీకి పునరుజ్జీవం...
అద్దాల మేడల కోసం, అందాల భామల కోసం తాము పనిచేయడం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. కొండపోచ్చమ్మ, రంగనాయకమ్మ సాగర్, మల్లన్న సాగర్ ఎక్కడికైనా తాను వస్తానని చర్చ పెడతామని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మూసీకి పునరుజ్జీవం అందిస్తామని చెప్పారు. మూసీ విషయంలో చరిత్ర ఎవరినీ మర్చిపోదన్నారు. నిర్వాసితులను ఎలా ఆదుకోవాలో తమకు తెలుసునన్న రేవంత్ వర్షం వస్తే చెన్నై, బెంగళూరు నగరం ఏమైందో మనం కళ్లారా చూస్తున్నాం కదా? అని అన్నారు. ఆదాయాన్ని పెంచి పేదలకు పంచాలన్నదే తమ ప్రయత్నమని తెలిపారు. మీరే చెప్పాలని, అందరూ చెబితే టెండర్లను రద్దు చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.
141 కోట్ల రూపాయల వ్యయం...
ఇదేమీ కాళేశ్వరం కాదని రేవంత్ రెడ్డి అన్నారు. అధికారులు, మంత్రుల ముసుగులో దోచుకున్న దోపిడీ దొంగలు వీళ్ల అని అన్నారు. మూసీలో ఉన్న మురికి కంటే ప్రజల మెదళ్లలో విషం నింపే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. నగరం మధ్యలో నది ప్రవహించే నగరమే దేశంలో లేదని రేవంత్ రెడ్డి అన్నారు. ఆరు నెలల నుంచి అధికారులు సర్వే చేస్తూ ఒక నిర్ణయానికి వచ్చామన్నారు. యూట్యూబ్‌లతో అధికారంలోకి రాలేరని రేవంత్ రెడ్డి హితవు పలికాు. ఇప్పటి వరకూ ప్రభుత్వం మూసీ నదికి చేసిన ఒప్పందం విలువ 141 కోట్ల రూపాయలు మాత్రమేనని అన్నారు. మరి లక్షన్నర కోట్లు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇది మూసీ సుందరీకరణ కాదని, మూసీ పునరుజ్జీవనం అని ఆయన స్పష్టత ఇచ్చారు.
Tags:    

Similar News