Revanth Reddy : పెద్దమ్మతల్లి సాక్షిగా చెబుతున్నా.. రుణ మాఫీ చేస్తా
ఆగస్టు 15వ తేదీలోగా రైతు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు
ఆగస్టు 15వ తేదీలోగా రైతు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి సాక్షిగా మాట ఇస్తున్నానని ఆయన అన్నారు. హరీశ్ రావు లాంటి వ్యక్తులు రాజీనామా చేస్తే ఆ నియోజకవర్గాలకు పట్టిన చీడ పోతుందని అన్నారు. అసెంబ్లీలో చర్చిద్దామంటే కేసీఆర్ పారిపోయారన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చించడానికి రావాలని ఆయన సవాల్ విసిరారు.
రిజర్వేషన్లు రద్దు చేయడమే...
మహబూబ్ నగర్ లో భోజనం చేస్తుండగా కరెంట్ పోయిందని కేసీఆర్ చేస్తున్న ట్వీట్ కు ఆయన కౌంటర్ ఇచ్చారు. ఆర్ఎస్ఎస్ విధానాన్ని అమలు చేయాలని ప్రధాని మోదీ, అమిత్ షా ప్రయత్నిస్తున్నారన్నారు. రిజర్వేషన్లు రద్దుచేయడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని తెలిపారు. వివిధ కులాలు, వర్గాలు ఉంటే హిందువులు ఏకతాటిపైకి రారని, అందుకే రిజర్వేషన్లను రద్దు చేస్తే వారంతా ఒకటే భావన కలుగుతుందని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలన్నదే దాని లక్ష్యమని ఆయన అన్నారు. రిజర్వేషన్ల రద్దుపై బీజేపీ విధానమేంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.