జనవరిలో దావోస్ కు చంద్రబాబు, రేవంత్
జనవరిలో దావోస్ పర్యటనకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు.
జనవరిలో దావోస్ పర్యటనకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. వచ్చే నెల 20వ తేదీ నుంచి దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సదస్సు జరగనుంది. భారత్ నుంచి మూడు రాష్ట్రాలకు చెందని ముఖ్యమంత్రులు పాల్గొంటారు. అందులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా పాల్గొననున్నారు.
పెట్టుబడులు కోసం...
దావోస్ పర్యటనలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేయనున్నారు. తమ రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ప్రయత్నించడానికి ఈ సదస్సు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. తమ రాష్ట్రంలో అనుకూల పరిస్థితులతో పాటు పారిశ్రామికవేత్తలకు అందించే రాయితీల విషయం కూడా సదస్సులో తెలియజెప్పనున్నారు. ఈ సదస్సులో ఏపీ మంత్రి లోకేష్ కూడా పాల్గొంటారు.