Breaking : అల్లు అర్జున్ అరెస్ట్ పై రేవంత్ రెడ్డి ఏమన్నారంటే?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు.

Update: 2024-12-13 09:37 GMT

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పై స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. ఈ విషయంలో ఎవరి జోక్యం ఉండదుఅని అన్నారు. చట్టంముందు అందరూ సమానమేనని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పోలీసుల విచారణలో భాగంగా కేసుల్లో భాగస్వామ్యులైన వారిపై చర్యలు తీసుకుంటారనిరేవంత్ రెడ్డి న్నారు.

చట్టం తన పని తాను చేసుకుంటుందని...
అల్లు అర్జున్ విషయంలో తన జోక్యం ఏమీ లేదని ఢిల్లీలో జరిగిన మీడియా చిట్ చాట్ లో మాట్లాడుతూ తొక్కిసలాటలో ఒకరు మరణించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. చట్టం ముందు అందరూ సమానులేనని, మోహన్ బాబు విషయంలో కోర్టు ఆర్డర్స్ ను బట్టి పోలీసులు ముందుకు వెళుతున్నారని తెలిపారు.


ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Download The App Now

Tags:    

Similar News