Revanth Reddy : వరంగల్ లో భారీ బహిరంగ సభ... ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం

ఎన్ని ఇబ్బందులైనా, సవాళ్లు ఎదురైనా ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు

Update: 2024-07-18 11:55 GMT

ఎన్ని ఇబ్బందులైనా, సవాళ్లు ఎదురైనా ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. కాంగ్రెస్ మాట ఇస్తే అది శిలా శాసనమని ఆయన అన్నారు. గత ప్రభుత్వాలు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశాయని తెలిపారు. నాలుగు కోట్ల మంది రైతుల ఆకాంక్షను నెరవేర్చే లక్ష్యంగా నేడు రైతు రుణమాఫీని అమలు చేస్తున్నామని తెలిపారు. ఇది తన జీవితంలో మరుపురాని రోజు అని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ ప్రకారం ఇచ్చిన హామీని అమలు చేస్తున్నామని తెలిపారు. 

నాలుగు కోట్ల మంది...
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను సోనియా గాంధీ నెరవేర్చారన్నారు. ఒకేసారి 31 వేల కోట్ల రూపాయలతో రైతు రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. ఎల్లుండి ఢిల్లీ వెళతానని, రాహుల్ గాంధీని కలసి ఇక్కడకు రావాలని ఆహ్వానిస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు. ఐదు లక్షల మందితో వరంగల్ లో సభను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తాము చెప్పినట్లుగానే ఆగస్టు 15వ తేదీలోపు రెండు లక్షల రూపాయల రుణాలను మాఫీ చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే అన్ని వర్గాల ప్రజలు ఆనందంతో ఉంటారని ఆయన అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం కుటుంబ పార్టీగానే మిగిలిపోయిందన్నారు. కేవలం కొందరికే ప్రయోజనాలు దక్కేవని చెప్పారు. ఇప్పుడు తెలంగాణలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి అడుగు పనిచేస్తుందని తెలిపారు.


Tags:    

Similar News