Revanth Reddy : ఎవరు సీఎం అయినా సన్న బియ్యం పథకం కొనసాగించాల్సిందే
సన్నబియ్యం పథకం చరిత్రలో నిలిచపోతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.;

సన్నబియ్యం పథకం చరిత్రలో నిలిచపోతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హుజూర్ నగర్ లో ఆయన సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారు.ఇది ఉగాది పర్వదినమే కాదు.. పేదవాడికి పట్టెడన్నమే కాదు.. మారుమూల పల్లెల్లోనూ సన్న బియ్యంతో అన్నం తినాలన్న మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకు వచ్చామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇదొక అద్భుతమైన పథకమని సీఎం అన్నారు. శ్రీమంతులు తినే సన్నబియ్యాన్ని పేదలకు అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పేదలందరికీ సన్న బియ్యాన్ని అందిస్తామని తెలిపారు. రేషన్ కార్డులోని సభ్యులందరికీ ఒక్కొక్కరికీ ఆరు కిలోల బియ్యాన్ని అందిస్తామని చెప్పారు. పేదకు కడుపు నిండా పెట్టే పథకం ఇది అని అన్నారు.
ఆహార భద్రతచట్టాన్ని తెచ్చి...
ఆహార భద్రతచట్టాన్ని కాంగ్రెస్ తెచ్చిందని, సోనియాగాంధీకి అందరం రుణపడి ఉండాలని కోరారు. ఐదు పది రూపాయలకే దొడ్డుబియ్యాన్ని రీసైక్లింగ్ చేసి అమ్ముతున్నారని అన్నారు. దొడ్డుబియ్యం ఒక మాఫియా అని అన్నారు. సన్నబియ్యం ఆలోచన పదేళ్లలో ఎప్పుడైనా గత ప్రభుత్వం చేసిందా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ వడ్లను 4,500 రూపాయలకు కొన్నారన్నారు. ఆ ప్రభుత్వంలో పేదలకు ఒనగూరిందేమీ లేదన్న రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల సంక్షేమానికి ప్రధమ ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
గత ప్రభుత్వానికి...
ఇది తెలంగాణ ప్రజలు గుర్తుంచుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు. సన్నబియ్యం పథకం చరిత్రలో నిలిచపోతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ కు ఓట్ల మీద సీట్ల మీద ధ్యాస తప్ప పేదల మీద లేదని రేవంత్ రెడ్డి అన్నారు. చరిత్రలో ఎవరు ముఖ్యమంత్రి అయినా ఈ పథకాన్ని కొనసాగించాల్సిందేనని రేవంత్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లాకు నీళ్లు అందించే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. మీ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు పని మంతులని, వారు ఖచ్చితంగా ప్రజలకు మేలు చేస్తారని తెలిపారు. ఇప్పటి వరకూ ఎన్నో ప్రాజెక్టులను కట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అదే పంథాను కొనసాగిస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు.