Chief Ministers meeting : రెండు రాష్ట్రాల డిమాండ్లు అధికమే.. అవి ఒప్పుకోవడమే గగనం కదా?

నేడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల జరగనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రెండు రాష్ట్రాల ప్రజలు ఈ సమావేశంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Update: 2024-07-06 05:26 GMT

నేడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల జరగనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రెండు రాష్ట్రాల ప్రజలు ఈ సమావేశంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల మధ్య జరుగుతున్న ఒక అసాధారణమైన సమావేశం అని పలవురు విశ్లేషిస్తున్నారు. ఈ సమావేశంతో రెండు రాష్ట్రా ల మధ్య నలుగుతున్న అనేక సమస్యలు ఇక కొలిక్కి వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రెండు రాష్ట్రాల మధ్య ఆస్తుల వాటాల పంపిణీతో పాటు గోదావరి, కృష్ణా జలాలే కీలకంగా మారుతున్నాయి. అయితే పలు సంస్థల ఆధ్వర్యంలో ఉన్న ఆస్తుల పంపిణీ ఈపాటికే జరిగి ఉండేదని ఏపీ ముఖ్యమంత్రులు మొండిపట్టుదలకు పోయి విషయాలను జటిలం చేస్తున్నారన్న వ్యాఖ్యలు ఉన్నాయి.

అనేక సమస్యలు...
అయితే ఇటీవల చంద్ర బాబునాయుడు ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక తాను భేషజాలకు పోబోవడం లేదని రెండు రాష్ట్రాల మధ్య నలుగుతున్న సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని చెప్పారు. తన ముందున్న లక్ష్యాల్లో అమరావతి రాజధాని నిర్మాణంతోపాటు పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును పూర్తి చేయడమేనని చెప్పారు కూడా. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలు సమస్యల పై శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తాయన్న అం చనాలు పెరుగుతున్నాయి. అయితే అనేక సమస్యలు మాత్రం ఇద్దరినీ రాజకీయంగా ఇబ్బందిని తెచ్చిపెట్టేవిగా ఉన్నాయి. ఒకరు తగ్గారని అనిపించుకోవడం ఇద్దరు ముఖ్యమంత్రులు భావించరు.
ఎవరి ప్రయోజనాలు...
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భిన్నమైన ప్రభుత్వాలున్నాయి. ఎవరి రాష్ట్ర ప్రయోజనాలు వారికి ముఖ్యమే. అయితే కొన్ని విషయాల్లో తగ్గాల్సి ఉంటుంది. కొన్ని అంశాలపై పట్టుబట్టాల్సి కూడా ఉంటుంది. అందుకే ఈ సమావేశంతోనే సమస్యలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం లేకపోయినా రాజకీయంగానూ, రెండు రాష్ట్రాల మధ్య స్నేహ సంబంధాలు కొనసాగించడానికి ఇది ఒక మంచి ప్రయత్నంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే అనేక సమస్యలు పదేళ్లుగా తిష్ట వేసుకుని కూర్చున్నాయి. దాని వల్ల ప్రజలపై నేరుగా ప్రభావం చూపేవి కొన్ని, చూపనవి కొన్ని ఉన్నాయి. కృష్ణా జలాల పంపిణీ చాలా క్లిష్టతరంగా మారనుంది. అదే సమయంలో కార్పొరేషన్లు, ఆస్తుల పంపకం కూడా అంత సులువు కాదు.
పట్టుదలకు పోరని....
ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశం సహృద్భావ వాతావరణంలో జరుగుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇద్దరికీ ఎటువంటి భేషజాలు లేవు. ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం కూడా ఎవరికీ తెలియందేం కాదు. కానీ ఈ విషయాల్లో అనుబంధాలు, గత సంబంధాలు పనిచేయవు. ఎందుకంటే ఏమాత్రం తేడా వచ్చినా రాజకీయంగా ఇబ్బందులను ఎదుర్కొనాల్సి వస్తుంది. అందుకే ఇది మొదటి సమావేశం కనుక కొన్ని ప్రధాన సమస్యలపైన చర్చించినప్పటికీ దానికి ఎండ్ కార్డు పడే అవకాశం లేదన్నది అధికారిక వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇద్దరూ పట్టుదలకు పోకుండా సంయమనంతోనే చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం కోసం ప్రయ్నత్నించడాన్ని ఎవరూ తప్పు పట్టరు. చంద్రబాబుకు పెద్దగా ఇబ్బందులు లేకపోయినా రేవంత్ రెడ్డికి మాత్రం ఒక హైకమాండ్ అనేది ఉంది. అందుకే జాగ్రత్తగా ఈ సమావేశంలో ఆయన వ్యవహరిస్తారంటున్నారు.


Tags:    

Similar News