క్రిస్మస్ వేడుకలు ప్రారంభం
తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. తెలంగాణలోని మెదక్ సీఎస్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి
రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. తెలంగాణలోని మెదక్ సీఎస్ చర్చిలో క్రిస్మస్ వేడుకలను బిషప్ సాల్మన్ రాజు ప్రారంభించారు. శిలువ ఊరేగింు మొదటి ఆరాధనలో ఆయన పాల్గొన్నారు. విజయవాడలోని గుణదలో ఉన్న చర్చిలో కూడా క్రిస్మస్ వేడుకలు ప్రారభమయ్యాయి.
ప్రార్థనలకు....
వేల సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రార్థనలకు హాజరయ్యారు. కరోనా నిబంధనలను అనుసరించి క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. పులివెందులలోని చర్చిలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరికాసేపట్లో ప్రార్థనల్లో పాల్గొంటారు. క్రిస్మస్ సందర్భంగా ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.