హెవీ రెస్పాన్స్.. నిమిషానికి 700 చలాన్ల క్లియరెన్స్
తెలంగాణలో వాహనాల పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ మొదలయింది. ఈ నెల 1 నుంచి 31 వరకూ చలాన్లను క్లియర్ చేయాల్సి ఉంటుంది.
తెలంగాణలో వాహనాల పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ మొదలయింది. ఈ నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకూ పెండింగ్ చలాన్లను క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఈ పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ కు తొలిరోజు విశేష స్పందన కన్పించింది. నిమిషానికి 700 చలాన్లను క్లియరెన్స్ అవుతున్నాయి. ఆన్ లైన్, ఈ చలాన్ వెబ్ సైట్ ద్వారా పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకోవచ్చని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చెప్పారు.
రాయితీలు ఇవ్వడంతో....
పెండింగ్ చలాన్లు దాదాపు 600 కోట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. టూ వీలర్ కు చలాన్లలో 75 శాతం రాయితీ, కార్లు, హెవీ వెహికల్స్ కు 50 శాతం రాయితీ ప్రకటించారు. దీంతో వాహనదారులు తమ చలాన్లను క్లియర్ చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఈ నెల చివరి వరకూ సమయం ఉన్నా తొలిరోజే మంచి స్పందన కన్పిస్తుందని పోలీసు అధికారులు చెబుతున్నారు.