రెండో విడత మల్లు పాదయాత్ర ప్రారంభం

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర మధిర నుంచి ప్రారంభమయింది.;

Update: 2022-03-25 04:25 GMT
mallu bhatti vikramarka, clp leader, congrss, padayatra
  • whatsapp icon

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర మధిర నుంచి ప్రారంభమయింది. అసెంబ్లీ సమావేశాలుండటంతో ఆయన పాదయాత్రకు స్వల్ప విరామమిచ్చారు. గత నెల 27న ముదిగొండ మండలం యడవల్లి నుంచి పాదయాత్రను ప్రారంభించారు. 103 కిలోమీటర్ల మేరకు నడిచారు. ఈ నెల 5వ తేదీన పాదయాత్రకు మల్లు భట్టి విక్రమార్క బ్రేక్ ఇచ్చారు. ఈరోజు మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలం అమ్మపేట నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది.

బ్రేక్ ఇచ్చి....
చింతకాని, బోనకల్లు, మధిర, ఎర్రుపాలెం మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. రాత్రికి జగన్నాధపురంలో మల్లు భట్టి విక్రమార్క బస చేయనున్నారు. వచ్చే పదిరోజుల్లో వంద కిలోమీటర్ల మేరకు పాదయాత్రను చేయాలని భట్టి విక్రమార్క నిర్ణయించారు. పాదయాత్రకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు హాజరయ్యారు.


Tags:    

Similar News