Telangana : తెలంగాణ రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పనున్న రేవంత్ సర్కార్

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పనుంది.

Update: 2024-08-12 05:28 GMT

congress government, farmers, rythu bharosa , good news

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. ఇప్పటికే రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఆగస్టు 15వ తేదీ నాటికి పూర్తి చేయనుంది. దీంతో రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట మేరకు తాము రైతు రుణమాఫీ ఏకకాలంలో చేశామని తెలంగాణ ప్రభుత్వం చెప్పుకునేందుకు అవకాశం దక్కింది. విపక్ష పార్టీలు దీనిని ఎన్నికల్లో ఇచ్చిన హామీగా కొట్టిపారేశారు. మాజీ మంత్రి హరీశ్ రావు అయితే ఆగస్టు 15వ తేదీలోగా రెండు లక్షల రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. అంతేకాదు తన రాజీనామా పత్రాన్ని కూడా గన్ పార్క్ వద్ద మీడియా మిత్రులకు అందచేశారు.

అందరికీ ఎందుకు?
అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణమాఫీ అయితే చేశారు. అయితే ఇప్పుడు తాజాగా విపక్షాలు రైతు భరోసా ఎప్పడని ప్రశ్నిస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు కింద ఎకరాకు ఐదు వేల రూపాయల చొప్పున రెండు సీజన్లకు పది వేల రూపాయలు అందించేవారు. కానీ కాంగ్రెస్ మాత్రం ఎన్నికల ప్రచార సమయంలో తాము అధికారంలోకి వస్తే ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఎకరానికి ఇస్తామని ప్రకటించింది. ఇందుకోసం కసరత్తు ప్రారంభమయినట్లు తెలిసింది. దీనికి సంబంధించి ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లోనూ 15,075 కోట్ల రూపాయల నిధులను కేటాయించారు.
ఎవరికివ్వాలన్న దానిపై...
అయితే రైతు భరోసా ఎవరికి ఇవ్వాలన్న దానిపై కొంత తర్జన భర్జన జరుగుతుంది. పేద, మధ్యతరగతి రైతులకు మాత్రమే ఇచ్చేలా నిబంధనలను మార్చే అవకాశముంది. ఎకరా ఉన్న వారికి పదిహేను వేలు, వంద ఎకరాలున్న భూస్వామికి పదిహేను లక్షలు ఎలా ఇస్తారన్న ప్రశ్న తలెత్తుతుంది. గత ప్రభుత్వం భూమి ఉన్న ప్రతి వారికి ఇవ్వడంతో ఎమ్మెల్యేలు, ధనవంతులు కూడా రైతు బంధు పథకం కింద లబ్ది పొందారు. అలాంటి వారిని ఏరిపారేసి పెట్టుబడి కోసం అవసరమున్న వారికే రైతు భరోసా ఇవ్వాలన్న నిర్ణయానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినట్లు తెలిసింది. ఇందుకోసం కేవలం పది ఎకరాలు లోపు ఉన్న వారికే ఈ పథకం వర్తించేలా నిబంధనలు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. అంతా ఓకే అయితే అతి త్వరలోనే రైతుభరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశముంది.


Tags:    

Similar News