Telangana : సంక్రాంతి సెలవులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
సంక్రాంతి సెలవులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.;
సంక్రాంతి సెలవులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అలాగే కళాశాలలకు మాత్రం ఈ నెల 11వ తేదీ నుంచి 16వతేదీ వరకూ సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలలకు వారంరోజులు, కళాశాలలకు ఆరు రోజులు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
ప్రయివేటువిద్యాసంస్థలకు...
సంక్రాంతి పండగ ఏపీలో పెద్ద పండగ. తెలంగాణలో దసరాను అతి పెద్ద పండగగా జరుపుకుంటారు. అందుకే సెలవులు తెలంగాణలో తక్కువగా ఇచ్చారంటున్నారు. ఈరోజు ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలకు కూడా వర్తిస్తాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ