Telangana Cabinet : నేడు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం.. వారికి గుడ్ న్యూస్
తెలంగాణ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది.;
తెలంగాణ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. ప్రధానంగా రైతు భరోసాకు సంబంధించి విధివిధానాలపై నేడు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశముంది. సంక్రాంతి నుంచి రైతు భరోసానిధులను రైతుల ఖాతాల్లో వేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఈ సమావేశంలో రైతు భరోసా విధివిధానాలకు సంబంధించి కేబినెట్ ఆమోదించి ఈ నెల 14వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో వేయాలని నిర్ణయించారు.
కీల నిర్ణయాలకు ఆమోదం...
ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వం వహించిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై రైతు భరోసా విధివిధానాలను నిర్ణయించి ముఖ్యమంత్రికి అందచేసింది. దీనిపై నేటి మంత్రి వర్గ సమావేశంలో చర్చించి ఆమోదించనున్నారు. దీంతో మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణ వంటి పనులకు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. అదే సమయంలో రిజనల్ రింగ్ రోడ్డుపై నిన్న చర్చించిన అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మంత్రివర్గ సమావేశంలో మంత్రుల ముందు ఉంచనున్నారు. వీటితో పాటు పలుకీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశముంది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now