యాదగిరిగుట్టకు ఈరోజు వెళుతున్నారా? అయితే వేచి ఉండాల్సిందే

యాదగిరిగుట్ట లో పెరిగిన భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి యాదగిరిగుట్టకు తరలి వస్తున్నారు;

Update: 2025-01-05 06:07 GMT

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Nowయాదగిరిగుట్ట లో పెరిగిన భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి యాదగిరిగుట్టకు తరలి వస్తుండటంతో కిటకిటలాడుతుంది. స్వామివారి ఉచిత దర్శనానికి రెండు గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. ప్రత్యేక దర్శనానికి ఒక గంట సమయం పడుతుందని తెలిపారు.



రెండు గంటల పాటు...

క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. సెలవుదినాల్లో యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తుల బారులు తీరుతారు. తలనీలాల వద్ద కూడా రద్దీ కొనసాగుతుంది. అలాగే అన్నదానం వద్ద కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నారు.


ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now



Tags:    

Similar News