Telangana : అబ్బో.. చలి చంపేస్తుందిగా.. గడ్డకట్టి పోతున్నాంగా

తెలంగాణలో చలి తీవ్రత బాగా పెరిగింది. గత రెండు రోజుల నుంచి చలి ఎక్కువగా ఉంది;

Update: 2025-01-04 04:01 GMT




 


తెలంగాణలో చలి తీవ్రత బాగా పెరిగింది. గత రెండు రోజుల నుంచి చలి ఎక్కువగా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు తెలంగాణ వ్యాప్తంగా నమోదవుతున్నాయి. ఉత్తర తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. అదే సమయంలో ఏజెన్సీ ప్రాంతాల్లోనూ చలి ఎక్కువగా ఉండటంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. బయటకు రావడానికి భయపడిపోతున్నారు. తెలంగాణలో గతంలో ఎన్నడూ ఇంత చలి లేదని ప్రజలు చెబుతున్నారు. చలి గాలికి ప్రజలు ఉదయం 9 గంటల వరకూ బయటకు రావడం లేదు. పది గంటల వరకూ ఇళ్లలో నుంచి కూడా బయటకు రావడం లేదు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో చలి తీవ్రత పెరగడంతో వ్యాపారాలు కూడా మూలన పడ్డాయి.

పొగమంచు పెరగడంతో...
చలి తీవ్రతతో పాటు పొగమంచు కూడా ఎక్కువగా ఉంది. బయటకు వస్తే కనీసం కంటికి కన్పించడం లేదు. వాహనాల రాకపోకలకు కూడా ఇబ్బందికరంగా మారింది. దాదాపు కొన్ని గజాల వరకూ కనిపిండచం లేదు. దీంతో వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు. నిదానంగా వాహనాలను నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనేక ప్రాంతాల్లో ప్రమాదాలు కూడా జరుగుతున్నట్లు తెలిసింది. ప్రధానంగా జాతీయ రహదారులపై పొగమంచు కారణంగా వాహనాల రాకపోకల్లో ఆలస్యమవుతున్నాయి. విమానాల ల్యాండింగ్ కూడా కష్టమయింది. ఇదే సమయంలో కొన్నిరైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రయాణికులు తమ ప్రయాణాలు ఆలస్యం కావడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కనీస ఉష్ణోగ్రతలు...
ఇక తెలంగాణలో నేడు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొమురం భీం, ఆదిలాబాద్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లాలో 7.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పటాన్ చెర్వులో 8.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. హైదరాబాద్ న గరంలో 13.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో చలి తీవ్రతకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పలు రోగాల బారిన పడుతున్నారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు చలి తీవ్రత నుంచి కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now

Tags:    

Similar News