Rahul Gandhi : నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు తెలంగాణలో పర్యటించనున్నారు;

Update: 2024-05-09 02:06 GMT

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారానికి ఇంకా మూడు రోజులు మాత్రమే సమయం ఉండటంతో రాహుల్ గాంధీ నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ లో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు.

నర్సాపూర్ లో...
నర్సాపూర్ లో సాయంత్రం నాలుగు గంటలకు జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా రాహుల్ గాంధీ ప్రచారాన్ని నిర్వహించనున్నారు. పార్టీ నేతలు రాహుల్ గాంధీ సభకోసం భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారు. సభకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.


Tags:    

Similar News