Telangana : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం నేడు టీచర్స్ ఉమెన్స్ డే
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు మహళ ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది.;
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు మహళ ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఏడాది జనవరి 3వ తేదీన సావిత్రిబాయి పూలే జయంతి నాడు మహళా ఉపాధ్యాయ దినోత్సవం జరపాలని నిర్ణయించింది. ఈరజు అన్ని జిల్లాల్లోని కలెక్టర్లు సావిత్రి బాయి పూలే జయంతి ఉత్సవాలను అధికారికిగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఉత్తమ టీచర్లను...
వీటి నిర్వహణ కు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఈరోజు ఉత్తమ విద్యాబోధనలను అందించిన మహిళ టీచర్లను సత్కరించాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. కలెక్టర్లు దగ్గరుండి ఈ కార్యక్రమాలను పర్యవేక్షించాలని, విద్యాశాఖకు కేటాయించే నిధుల నుంచి కొంత మొత్తాన్ని మహిళ టీచర్స్ డేను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now