నేడు సీఎల్పీ భేటీ
నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ ఎల్పీ సమావేశం జరగనుంది.;

నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ ఎల్పీ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం సమావేశం జరగనుంది. అసెంబ్లీ కమిటీ హాలు -1లో జరగనున్న సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేయనున్నారు.
బడ్జెట్ సమావేశాల్లో...
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానుండటంతో ప్రతి సభ్యుడు రోజూ విధిగా సభకు హాజరు కావాలని రేవంత్ రెడ్డి సూచించనున్నారు. దీంతో పాటు సబ్జెక్ట్ పై అవగాహన పెంచుకుని ప్రతి అంశంపై మాట్లాడేందుకు సభ్యులు ప్రయత్నించాలని కోరనున్నారు. అలాగే విపక్షాల విమర్శలకు దీటుగా సమాధానం చెప్పేలా ఉండాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించనున్నారు.