మూడు రాజధానులు కాదు.. మూడు రాష్ట్రాలు... జగన్ కు జగ్గారెడ్డి సూచన

మూడు రాజధానులు కాదు.. మూడు రాష్ట్రాలు చేసి ముగ్గురూ పంచుకోండి అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు

Update: 2022-09-27 07:09 GMT

jaggareddy

మూడు రాజధానులు కాదు.. మూడు రాష్ట్రాలు చేసి ముగ్గురూ పంచుకోండి అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. వైఎస్ షర్మిల తనపై చేసిన విమర్శలకు జగ్గారెడ్డి సమాధానమిచ్చారు. వైఎస్ కుటుంబ సభ్యులే ముఖ్యమంత్రులుగా ఉండాలా? అని ఆయన ప్రశ్నించారు. కొద్దిపేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ఎటూ మూడు రాజధానులు అంటున్నారని, మూడు రాష్ట్రాలు చేస్తే, మూడింటికి జగన్, షర్మిల, విజయమ్మలు ముఖ్యమంత్రులుగా ఉండవచ్చని ఎద్దేవా చేశారు.

మీ కుటుంబమేనా?
తెలంగాణలోనూ అనేక మంది ముఖ్యమంత్రులు కొడుకులున్నారని, వారికి సీఎం అయ్యే అర్హత లేదా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. మీ కుటుంబమే రెండు రాష్ట్రాలు ఏలాలా? అని నిలదీశారు. షర్మిల బీజేపీ బినామీ అని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఆడబిడ్డ కాబట్టి తాము వ్యక్తిగత విమర్శలు చేయలేకపోతున్నామని అన్నారు. పాదయాత్ర చేసుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదని, వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకోబోమని జగ్గారెడ్డి హెచ్చరించారు. వైఎస్ కుటుంబమే ముఖ్యమంత్రి పదవులను అలంకరించాలంటే కుదరదని కూడా చెప్పారు. ఆరోగ్యశ్రీలో అన్ని రకాల రోగాలను చేర్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను జగ్గారెడ్డి కోరారు.


Tags:    

Similar News