జీవన్ రెడ్డి సంచలన నిర్ణయం...మల్లికార్జున ఖర్గే కు లేఖ

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం నిర్ణయంపై ఆయన మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు.

Update: 2024-10-24 07:02 GMT

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం నిర్ణయంపై ఆయన మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. పార్టీ ఫిరాయింపులను ఇక్కడ ప్రోత్సహిస్తున్నారని, పార్టీ ఫిరాయింపుల చట్టం అమలులోకి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, అయినా ఇక్కడ ప్రభుత్వం దానిని తుంగలో తొక్కి బీఆర్ఎస్‌లో గెలిచిన వాళ్లను కాంగ్రెస్ లో చేర్చుకోవడమేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు మంచి మెజారిటీ ప్రజలు ఇచ్చారన్నారు. బీఆర్ఎస్ లో క్రియాశీలకంగా పనిచేసిన వారిని సయితం పార్టీలో చేర్చుకుని ఇక్కడ ఉంటున్న వారిని ఇబ్బంది పెడుతున్నారని జీవన్ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న...
ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తనను తీవ్ర మనోవేదనకు గురిచేశాయన్నారు. అందుకే మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారన్నారు. బీఆర్ఎస్ కు అత్యంత సన్నిహితుడిగా ఉండి, గతంలో కాంగ్రెస్ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించిన పోచారం శ్రీనివాసులురెడ్డిని సయితం పార్టీలో చేర్చుకున్నారన్నారు. దీనివల్ల కాంగ్రెస్ లో సుదీర్ఘకాలం నుంచి కొనసాగుతున్న తమ లాంటి వాళ్లకు ఇబ్బందులు కలుగుతాయని ఆయన అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందేనని ఆయన మరోసారి కోరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకే ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నారన్నారు.


Tags:    

Similar News