ముఖ్యమంత్రిపై సీపీఐ నారాయణ హాట్ కామెంట్స్
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హాట్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లే అవకాశముందని ఆయన అన్నారు
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హాట్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లే అవకాశముందని ఆయన అన్నారు. బడా బాబుల ఒత్తిడితో సీఎం రేవంత్ రెడ్డి జైలుకు వెళ్ళే ప్రమాదముందన్న నారాయణ, శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆయన జన్మస్థలం జైళ్లను బాగుచేయాలని ఎద్దేవా చేశారు. హైడ్రా దెబ్బకు బడా బాబులు అయినా జైలుకు వెళ్ళాల్సి వస్తుందన్నారు.
పులి మీద స్వారీ...
లేదా వాళ్ళ ఒత్తిడితో ముఖ్యమంత్రి అయినా జైలుకు వెళ్లే ప్రమాదముందని నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. హైడ్రా కూల్చివేతల దెబ్బకు రాజకీయ నేతలు, బిల్డర్లు, పారిశ్రామిక వేత్తలు భయపడిపోతున్నారూ అన్నారు. రేవంత్ రెడ్డి పులి మీద స్వారీని మొదలు పెట్టారని, మధ్యలో కిందకు దిగితే అది మింగేస్తుందంటూ హెచ్చరించారు.