ముందు పాలనపై దృష్టి పెట్టండి : నారాయణ
తెలంగాణ గీతం రూపొందించడం అభినందనీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు.
తెలంగాణ గీతం రూపొందించడం అభినందనీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. కానీ రాష్ట్ర చిహ్నం జోలికి వెళ్లకపోవడం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. ముందు చిహ్నంపై కాకుడా రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని నారాయణ ప్రభుత్వానికి తెలియజేశారు. సంగీతంలో బీఆర్ఎస్ ప్రాంతీయవాదం లేవనెత్తడం సరికాదని ఆయన అన్నారు.
కన్యాకుమారిని కలుషితం..
మోదీ ధ్యానం చేయడం కన్యాకుమారిని కలుషితం చేయడమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభిప్రాయపడ్డారు. కేంద్రంలో మోదీ రాకపోతే చంద్రబాబు ఇండియా కూటమిలోకి రావాలని కోరుకుంటామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పిలుపు నిచ్చారు. దేశంలో ఎన్డేఏ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని తెలిపారు.