కేసీఆర్ కు అన్నీ నార్మల్ .. వారం రోజుల విశ్రాంతి అవసరం
ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజులుగా బలహీనంగా ఉన్నారని యశోదా ఆసుపత్రి వైద్యులు చెప్పారు
ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజులుగా బలహీనంగా ఉన్నారని యశోదా ఆసుపత్రి వైద్యులు చెప్పారు. ఎడమ చేయి, కాలు కొంత లాగుతుందని చెప్పడంతో ఆయనకు వైద్య పరీక్షలు చేయాలని నిర్ణయించామని చెప్పారు. అలసట వల్ల కొంత ఇబ్బంది ఏర్పడి ఉంటుందని వారు తెలిపారు. ఇంటికి వెళ్లి పరీక్షలు చేసిన తర్వాత ఆయనకు మరికొన్ని పరీక్షలు చేయించాలని యశోదా ఆసుపత్రికి రావాలని సూచించామని చెప్పారు. యాంజియో గ్రామ్ లో ఎలాంటి బ్లాక్స్ లేవన్నారు.
మెడ భాగంలో కొంత....
గుండెకు సంబంధిత పరీక్షలన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు చేశామని, అన్ని పరీక్షలు నార్మల్ గా ఉన్నాయని చెప్పారు. ఎడమ చేయి నొప్పికి సంబంధించి మెడకు సంబంధించి ఎంఆర్ఐ టెస్ట్ లు కూడా చేశామని చెప్పారు. రక్త పరీక్షలు నిర్వహించామని చెప్పారు. వయసుతో పాటు వచ్చిన సమస్యతో స్పాండలైటిస్ తో బాధపడుతున్నారని డాక్టర్ ఎంవీ రావు తెలిపారు. రక్తపరీక్షలన్నీ చేశామని, బ్లడ్ ప్రషర్, షుగర్, యూరిన్ శాతం అన్నీ నార్మల్ గా ఉన్నాయన్నారు. ఆయనకు వారం రోజుల పాటు విశ్రాంతి అవసరమని తెలిపారు. ప్రతి వారం రోజులకు ఒకసారి టెస్ట్ లను నిర్వహిస్తామని చెప్పారు. సాయంత్రం 3,4 గంటల్లో డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. బాగా నీరసం ఉందని తమకు చెప్పారన్నారు.