తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతి
దూరదర్శన్ లో న్యూస్‌రీడర్ శాంతిస్వరూప్ మరణించారు. ఆయన తొలి తెలుగు న్యూస్ రీడర్
దూరదర్శన్ లో న్యూస్‌రీడర్ శాంతిస్వరూప్ మరణించారు. ఆయన తొలి తెలుగు న్యూస్ రీడర్. ఆయన రెండు రెండు రోజులు క్రితం గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ యశోదా ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు మరణించారు. తెలుగు తొలి న్యూస్ రీడర్ గా ఆయనకు పేరుంది. తెలుగులో దూరదర్శన్ లో తొలిసారి స్క్రీన్ మీద వార్తలు చదవిన ఆయన నాటి తరానికి అందరికీ గుర్తుండే ఉంటుంది.
కేవలం పత్రికలను చూసి మాత్రమే కొన్నేళ్ల పాటు వార్తలను చదివేవారు. తర్వాత టెలిప్రింటర్ చూసి చదివే అలవాటు చేసుకున్నారు. 1983 నవంబరు 14న తొలిసారి ఆయన దూరదర్శన్ లో వార్తలు చదవడం ప్రారంభించారు. 2011 వరకూ ఆయన దూరదర్శన్ లోనే పనిచేశారు. శాంతి స్వరూప్ కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.