Summer Effect : రెండు రోజులు వర్షాలు.. తీపి కబురే కదా?
వేసవి కాలంలో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈ నెల 7,8 తేదీల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
వేసవి కాలంలో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈ నెల 7,8 తేదీల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. నిన్న 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఈ కబురు చల్లని వార్త. ఈ నెల 6వ తేదీ వరకూ వాతవరణం పొడిగా ఉంటుందని, 7,8 తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మండే ఎండలతో పాటు, వడగాల్పులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బయటకు రావడానికి కూడా భయపడిపోతున్నారు.
అత్యధిక ఉష్ణోగ్రతలు...
నిన్న ఖమ్మంలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే భద్రాద్రి కొత్తగూడెంలోనూ అంతే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎలినినో కారణంగా జూన్ చివరి వరకూ ఎండలు ఈ ఏడాది మండిపోతాయని ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే రెండు రోజుల పాటు చిరుజల్లులు కురిసే అవకాశముందని పేర్కొనడం ఒకింత ఊరటకల్గించే అంశమే. ఈరోజు నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని కూడా వాతావరణ శాఖ తెలిపింది.