పదో తరగతి ఫలితాల విడుదల
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ పరీక్షల్లో 86.60 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 88.53, బాలుర ఉత్తీర్ణత శాతం 84.68గా ఉందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 2,793 పాఠశాలల్లో ఈసారి వంద శాతం ఉత్తీర్ణత వచ్చిందని ఆమె తెలిపారు. ఒక్కరు కూడా ఉత్తీర్ణత కాని పాఠశాలలు ఇరవై ఐదు వరకూ ఉన్నాయని సబిత తెలిపారు.
నిర్మల్ జిల్లా ఫస్ట్...
4.84.317 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారని ఆమె తెలిపారు. వికారాబాద్ జిల్లాలో 59.46 శాతం మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. అత్యల్పంగా, నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 99 శాతం మంది ఉత్తీర్ణులయ్యారని మంత్రి సబిత తెలిపారు. రీ వెరిఫికేషన్, కౌంటింగ్‌కు కూడా అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. ఎవరూ ఫెయిల్ అయ్యామని ఆందోళన చెందవద్దని మంత్రి సబిత కోరారు. జూన్ 14నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని ఆమె తెలిపారు.