Breaking : కవితకు మళ్లీ నోటీసులు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది.

Update: 2023-09-14 08:05 GMT

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. అరుణ్ రామచంద్ర పిళ్లే అప్రూవర్‌గా మారడంతో ఎమ్మెల్సీ కవిత విచారణ కీలకంగా మారింది. ఎన్నికలకు ముందు ఈ నోటీసులు మళ్లీ తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో కవితను ఈడీ మూడు రోజుల పాటు ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

రేపు విచారణకు..
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను గతంలోనే ప్రశ్నించారు. మరోసారి ఈడీ విచారణకు రమ్మని చెప్పడంతో మరోసారి సంచలనంగా మారింది. ఈ స్కామ్ లో కవిత ప్రమేయం ఉందని గతంలో ఈడీ తెలిపింది. అరుణ్ పిళ్లై బెయిల్ పిటీషన్ సందర్భంగా ఈడీ తరుపున న్యాయవాదులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ స్కామ్ కు సంబంధించిన సమావేశాల్లో కవిత పాల్గొన్నారని కూడా ఈడీ తెలిపింది. ఆ స్కామ్ ద్వారా వచ్చిన డబ్బుతోనే ఫీనిక్స్ కంపెనీ నుంచి భూములను కొనుగోలు చేశారని కూడా ఆరోపించారు. ఈ నేపథ్యంలో రేపు కవిత ఈడీ విచారణకు హాజరవుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.


Tags:    

Similar News