Breaking : ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ నోటీసులు
ఫార్ములా ఈ రేసు కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు
ఫార్ములా ఈ రేసు కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఐఏఎస్ అధికారి అరవిందకుమార్ తో పాటు, హెచ్ఎండీఏ మాజీ ఛీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి కి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. వచ్చే నెల 2,3 తేదీల్లో ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఫెమా నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలపై విచారణ జరుపుతుంది.
విదేశీ సంస్థలకు...
దాదాపు యాభై రెండు కోట్ల రూపాయల నిధులను విదేశీ సంస్థలకు పంపడంతో దీనిపై ఈడీ తొలుత అధికారులను విచారణ చేయాలని నిర్ణయించింది. ఫార్ములా ఈ రేసులో పెద్దయెత్తున అవినీతి జరిగిందని ఇప్పటికే ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చి నోటీసులు జారీ చేయడంతో కేటీఆర్ ను కూడా ఈ కేసులో త్వరలో ఈడీ నోటీసులు ఇచ్చింది. జనవరి 7వ తేదీన విచారణకు రావాలని కోరింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ కేసు నమోదు చేసింది.