సంక్రాంతికి ఊళ్లకు వెళ్లేవారికి ఆర్టీసీ గుడ్ న్యూస్
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇందుకోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇందుకోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. దాదాపు ఐదు వేల బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి ఎక్కువ సంఖ్యలో సొంత ఊళ్లకు చేరుకునేందుకు అవకాశముందని భావించిన ఆర్టీసీ అధికారులు ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక సర్వీసుల్లోనూ సాధారణ ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తామని తెలంగాణ ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.
అదనపు ఛార్జీలు...
ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ కూడా ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. దాదాపు 2,700కు పైగా ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాల నుంచి ఈ ప్రత్యేక సర్వీసులు తిరగనున్నాయి. అలాగే ఏపీలోని పలు ప్రాంతాల్లో ఈ స్పెషల్ బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని ఆర్టీసీ అధికారులు తెలిపారు.