Breaking : కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దు.. ఎప్పటి వరకూ అంటే?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్వాష్ పిటీషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ క్యాష్ పిటీషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ ఫార్ములా రేసులో మంగళవారం వరకూ అరెస్ట్ చేయవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫార్ములా ఈ కారు రేసు కు సంబంధించి తనపై నమోదయిన కేసులన్నీ కొట్టివేయాలంటూ కేటీఆర్ వేసిన పిటీషన్ ను విచారించిన హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
కౌంటర్ దాఖలు చేయడానికి...
కౌంటర్ దాఖలు చేయడానికి తమకు మంగళవారం వరకూ సమయం కావాలని ప్రభుత్వం తరుపున న్యాయవాది కోరారు. ఈ క్రమంలో తదుపరి విచారణను మంగళవారానికి హైకోర్టు వాయిదా వేసింది. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ ఏ1 నిందితుడిగా ఉన్నారు. దీంతో మంగళవారం నాడు తిరిగి దీనిపై విచారణ చేపట్టనుంది. కానీ విచారణ మాత్రం కంటిన్యూ చేసుకోవచ్చని తెలిపింది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now