నేడు తెలంగాణలో పాఠశాలలకు సెలవులు
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాప సూచకంగా నేడు తెలంగాణలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాప సూచకంగా నేడు తెలంగాణలో పాఠశాలలకు, విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేడు సెలవు దినంగా ప్రకటించడమే కాకుండా వారం రోజుల పాటు సంతాపదినాలను పాటించాలని ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
ముఖ్యమంత్రి సంతాపం...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానిగా మన్మోహన్ సింగ్ అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన మృతి పట్ల సంతాపాన్ని ప్రకటించారు. తనను మన్మోహన్ సింగ్ మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలిపారు. మనదేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయినట్లయిందని, ఆయన చేపట్టిన ఆర్థిక సంస్థరణల కారణంగా నేడు భారత్ అభివృద్ధి బాటలో పయనిస్తుందని మన్మోహన్ సింగ్ తెలిపారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now