Telangana : నేడు ఫార్ములా ఈ రేస్ కేసుపై విచారణ

ఫార్ములా ఈ కారు రేసు కేసులో నేటి నుంచి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ జరగనుంది.;

Update: 2025-01-02 04:20 GMT

ఫార్ములా ఈ కారు రేసు కేసులో నేటి నుంచి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ జరగనుంది. ఈరోజు హెచ్ఎండీఏ మాజీ చీఫ్ బీఎల్ఎన్ రెడ్డి నేటి విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే ఫార్ములా ఈ కారు రేస్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో నేటి నుంచి ఈడీ విచారణ ప్రారంభమవుతుంది. ఇప్పటికే జారీ చేసిన నోటీసులు ప్రకారం నేడు హెచ్ఎండీఏ మాజీ చీఫ్ బీఎల్ఎన్ రెడ్డి హాజరవుతారు.

బీఎల్ఎన్ రెడ్డిని...
ఈ ఫార్ములా రేస్ కు సంబంధించి నిధుల విడుదలకు సంబంధించిన లావాదేవీలపై ఆయన వద్ద ఉన్న డాక్యుమెంట్లను తీసుకు రావాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు కోరారు. అలాగే దానికి సంబంధించిన డాక్యుమెంట్లను కూడా తీసుకు రావాలని తెలిపారు. రేపు మరోసీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను విచారించనున్నారు. ఈ నెల 7వ తేదీన మాజీ మంత్రి కేటీఆర్ ను విచారించనున్నారు.


Tags:    

Similar News