కామారెడ్డి రైతులు.. ప్లాన్ లో మార్పు

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ ను రద్దు చేయాలంటూ రైతులు తమ ఆందోళనలను కొనసాగిస్తూనే ఉన్నారు

Update: 2023-01-09 04:06 GMT

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ ను రద్దు చేయాలంటూ రైతులు తమ ఆందోళనలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఎవరి భూములను స్వాధీనం చేసుకోబోమని కలెక్టర్ తెలిపినా తమ నిరసనలను మాత్రం ఆపేది లేదంటున్నారు. రైతులందరూ కలసి రైతు ఐక్య కార్యాచరణ కమిటీని రూపొందించుకుని నిరసనలు ప్రభుత్వానికి తెలియజేయాలని నిర్ణయించారు.

కౌన్సిలర్లను కలిసి...
ఈ మేరకు కామారెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించిన 49 మంది కౌన్సిలర్లకు రైతులు వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. మున్సిపల్ కౌన్సిల్ లో రైతులకు అనుకూలంగా తీర్మానం చేయాలన్న వత్తిడి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఇప్పటికే రైతులు వేసిన పిటీషన్ నేడు హైకోర్టులో విచారణకు రానుంది.


Tags:    

Similar News